అధికారి నిర్లక్ష్యంపై ‘బడంగ్‌పేట్’లో నిరసన
రంగంలోకి దిగిన డీసీ
బడంగ్ పేట్: బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో అధికారుల మొండి వైఖరిపై స్థానిక ప్రజలు, బీజేపీ నేతలు(BJP leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన సెగతో దిగివచ్చిన ఉన్నతాధికారులు సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గొడవ సర్దుమణిగింది. వివరాల్లోకి వెళితే సర్కిల్ పరిధిలోని మారుతినగర్ కాలనీ, భీష్మనగర్ కాలనీ, సాయిగోకుల్ కాలనీ, బడంగ్ పేట ఓల్డ్ విలేజ్, జే ఎన్ ఆర్ కాలనీల కు చెందిన వారంతా డ్రైనేజీ, రోడ్లు, స్ట్రీట్‌లైట్ల సమస్యలపై విన్నవించేందుకు వెళ్లిన కాలనీ వాసుల పట్ల ఏఏంసి శ్రీధర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము పని చేయం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే సమాధానంతో ఆగ్రహించిన స్థానిక కాలనీవాసులు బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డీసీ ఛాంబర్ ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ సరస్వతి, స్వయంగా నిరసనకారులతో మాట్లాడి, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీసీ హామీతో కాలనీ వాసులు శాంతించి తమ నిరసనను విరమించారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అనిత ప్రభాకర్, జగన్, సైదులు, సందీప్, ఆంజనేయులు, సురేందర్ రెడ్డి, మురళీకృష్ణ,రాహుల్, తీగల మహేందర్ రెడ్డి, రమణ గుప్తా, బాపనయ్య, కిరణ్ రాజ్, క్యారాగారి అరవింద్, ప్రవీణ్ గౌడ్, మహేందర్ యాదవ్, శ్రీనివాస్ గుప్తా, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.




