30 August, 2026 | 6:48 PM

Breaking News

సమాజ ప్రగతికి యువత తమ ప్రతిభను వినియోగించాలి   •   మాజీ ఎంపీపీ జగన్ మోహన్‌రావుకు పరామర్శ   •   అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆలరించిన పల్లి గ్రామ భక్తులు   •   కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు జిల్లా అధ్యక్షుని కృషి   •   భగవద్గీత శ్లోక పఠన పోటీలకు విశేష స్పందన   •   ఎంఎస్‌పీ గణపురం మండల అధ్యక్షుడిగా నాగరాజు   •   నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాలు   •   మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం ఆపన్నహస్తం   •   48గంటల రిలే నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన గొండ్వాన సంక్షేమ పరిషత్   •   జగన్నాధపురంలో ‘గ్రోమోర్’ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ వినోద్   •  

మద్యం తాగుతూ వ్యక్తి మృతి

19-10-2024 12:26 AM

మృతికి కారణాలపై పోలీసుల విచారణ

మహేశ్వరం, అక్టోబర్ 18: మద్యం తాగుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వినాయక హిల్స్ రోడ్డు నంబర్ 2లో నివసించే కేశవరావు (60) శుక్రవారం మధ్యాహ్నం అల్మాస్‌గూడ టీచర్స్ కాలనీలోని విజయ దుర్గ వైన్స్‌కు వెళ్లాడు. సిట్టింగ్ రూమ్‌లో మద్యం తాగుతూ సాయం త్రం 4 గంటల సమయంలో మృతిచెందాడు. అయితే, కేశవరావు మృత దేహాన్ని వైన్స్ సిబ్బంది బయటకు తీసుకొచ్చి రోడ్డుపైన పడేశారు. స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివ రాలు సేకరించారు. మృతుడి కొడుకు ప్రశాంత్‌కు సమాచారం అం దించారు. మృతికి కారణం మద్యం తాగడమేనా ? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేసును మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.