30 August, 2026 | 7:43 PM

అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆలరించిన పల్లి గ్రామ భక్తులు

30-08-2026 06:38 PM

బోథ్. ఆగస్టు 30 (విజయ క్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో శ్రావణమాసం ప్రారంభం నుండి జరుగుతున్న శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం ఆదిలాబాద్ లోని పల్లి గ్రామస్తులు అఖండ జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన భక్తులు రామనామం స్మరిస్తూ నృత్యాలు చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. వేల సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొని శబరిమాత ఆశీస్సులు పొందారు.