30 August, 2026 | 7:43 PM

కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు జిల్లా అధ్యక్షుని కృషి

30-08-2026 06:35 PM

బోథ్. ఆగస్టు 30 (విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతుంటే రానున్న రోజుల్లో బోత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్న ఉద్దేశంతో డిసిసి అధ్యక్షులు జాదవ్ నరేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన పార్టీని అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలపడడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని అయితే ఆయన హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంటే చూసి ఉరువలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

వారి వారి అనుచరులకు పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అధిష్టానం అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాలని జాదవ్ నరేష్ సూచిస్తే చూసి ఓర్చుకోలేక ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి స్థానికంగా జరుగుతున్న సంగతులు ఏమిటో అన్ని తెలిసిందన్నారు. ఫిర్యాదు చేసిన వారికి రానున్న రోజుల్లో ప్రజలే తగు గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.