షుగర్ మందుల కోసం క్యూ!
27-05-2026 12:00 AM
మహబూబాబాద్ (విజయక్రాంతి) : పొద్దు పొద్దున్నే.. ఓవైపు మహిళలు.. ఇంకోవైపు పురుషులు చేతిలో సంచులతో బారులు తీరిన దృశ్యం చూస్తే.. రేషన్ కోసమో..ఎరువుల కోసమో.. లేదంటే పంట ఉత్పత్తులను విక్రయించడం కోసమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ప్రతి నెల చివరి మంగళవారం షుగర్ వ్యాధి స్పెషలిస్ట్ డాక్టర్ ఇచ్చే మందుల కోసం ఇలా పరిసరప్రాంతాల నుంచి వందల సంఖ్యలో షుగర్ వ్యాధిగ్రస్తులు వచ్చారు.
వారంతా ఇలా టోకెన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం బారులు తీరడం పరిపాటిగా మారింది. తక్కువ ఖర్చుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, నెలకు సరిపడా మందులు ఇస్తుండటంతోరోజురోజుకు ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.






