17 April, 2026 | 8:45 AM

నిర్మల్ వాసికి అరుదైన ఘనత

14-06-2025 12:00 AM

కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన సాయి ప్రసాద్

నిర్మల్ జూన్ 13 (విజయ క్రాంతి) : నిర్మల్ పట్టణానికి చెందిన ముక్క సాయి ప్రసాద్ అరుదైన ఘనతను సాధించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తున శిఖరాల్లో ఒకటై న దక్షిణ ఆఫ్రికా ఖండంలోని ట్రాంజనీయ దేశంలో ఉన్న కిలిమంజారో శిఖరాన్ని ఈనెల 11న అధిరో హించి నట్టు ఆయన తెలిపారు.

ముక్క నరసయ్య కుమారుడైన సాయి ప్రసాద్ వృత్తిరీత్యా నిర్మాణ రంగంలో చార్టెడ్ అకౌంట్‌గా విధులు నిర్వహిస్తూనే పర్వత శిఖరాలు ఎక్కాలని ఆకాంక్షతో చిన్నప్పటినుంచి ఆసక్తి పెంచుకున్నారు.

2023లో భారత దేశంలోని ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన సాయి ప్రసాద్ ప్రస్తుతం సముద్ర మట్టానికి 58 95 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో శిఖరాన్ని అవరోదించినట్టు తెలిపారు. నిర్మల్‌కు చెందిన ఈ విద్యా ర్థి ఈ ఘనతను సాధించడం పట్ల నిర్మల్ వాసులు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నారు