మెడికవర్‌లో వెన్నునొప్పికి అరుదైన శస్త్ర చికిత్స
35 ఏళ్లుగా బాధపడుతున్న మహిళకు కొత్త జీవితం
హైదరాబాద్, 6 ఫిబ్రవరి (విజయక్రాంతి): గత 35 సంవత్సరాలుగా తీవ్రమైన వెన్నునొప్పి, వెన్ను దగ్గర నుంచి నిరంతరం గా చీము రావడం వంటి సమస్యలతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళకు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతమైన శస్త్రచికిత్స చేసి, ఆమెకు కొత్త జీవితం ఇచ్చారు. ఈ మహిళ సుమారు 30 సంవత్సరాల క్రితం విదేశాల్లో వెన్ను కింది భాగంలో వచ్చి న వాపు సమస్యకు సంబంధించి కొన్ని శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.
అయితే ఆ చికి త్సల తర్వాత కూడా నొప్పి తగ్గలేదు. ఏళ్ల తరబడి నొప్పి, చీము సమస్యలతో ఆమె సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకున్నారు. పాత వైద్య పత్రాలు కూడా అందు బాటులో లేకపోవడం వల్ల చికిత్స మరింత సవాలుగా మారింది. మెడికవర్ హాస్పిటల్‌లో సీనియర్ సర్జన్ డా. వెంకట పవన్ కు మార్ నేతృత్వంలో వైద్యులు చేసిన స్కానిం గ్ పరీక్షల్లో, ఆమె వెన్నుపూస కింది భాగం లో చాలా పెద్ద గడ్డ (కణితి) ఉన్నట్టు గుర్తించారు.
దాని పరిమాణం సుమారు 15x20 సెంటీ మీటర్లు ఉండగా, అది వెన్నెముకకు, మలద్వారానికి చాలా దగ్గరగా ఉండటంతో శస్త్రచికిత్స అత్యంత ప్రమాదకరంగా మారిం ది. ఇలాంటి కేసులు చాలా అరుదుగా మా త్రమే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను న్యూరో సర్జన్, ట్రామా సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, అనస్థీషియా నిపుణులు కలిసి ఒక బృందంగా నిర్వహించారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో ఎలాంటి నరాలకు హాని కలగకుండా గడ్డను పూర్తిగా తొలగించి అనంత రం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆ భాగాన్ని మళ్లీ సరిచేశారు.
శస్త్రచికిత్స తర్వాత మహిళకు ఎటువంటి నరాల సమస్యలు లేకుండా త్వరగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆమెకు నొప్పి లేదు, చీము సమస్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ జీవితం గడుపుతూ రోజువారీ పనులు చేసుకుంటున్నా రు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట పవన్ కుమార్ మాట్లాడుతూ,ఈ రోగి కేసు చాలా క్లిష్టమైనదన్నారు. అయినప్పటికీ ఆధునిక స్కానింగ్ పరీక్షలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం సహకారంతో మేము శస్త్రచికిత్సను సురక్షితంగా పూర్తి చేయగలిగామని తెలిపారు.
ఈ హై-రిస్క్ శస్త్రచికిత్సను న్యూరో సర్జ న్ డా.అనిల్ కుమార్, ట్రామా సర్జన్ డా. దామోదర్ కాకుమాను, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మడాల, చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డా. వేణుగోపాల్ ఎన్ సహా వివిధ విభాగాల నిపుణులు నిర్వహించారు. న్యూరో సర్జన్ డా క్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గడ్డ వెన్నెముకకు చాలా దగ్గరగా ఉండటం తో చిన్న పొరపాటు జరిగినా నరాలకు శాశ్వ త నష్టం జరిగే అవకాశం ఉంది.
ఎంతో జాగ్రత్తగా, దశలవారీగా శస్త్రచికిత్స నిర్వహించామన్నా రు .ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజ శేఖర్ మడాల మాట్లాడుతూ, గడ్డ తొలగించిన తర్వాత పెద్ద ఖాళీ ఏర్పడింది. రోగి త్వరగా కోలుకునేలా ప్రత్యేకమైన ప్లాస్టిక్ సర్జరీ పద్ధతులతో ఆ భాగాన్ని పునర్నిర్మించామని తెలిపారు. మెడికవర్ వైద్య బృందం మాట్లాడుతూ దీర్ఘ కాలంగా వెన్నునొప్పి, వాపు లేదా చీము స మస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెం టనే నిపుణులైన వైద్యులను సంప్రదించా లి.ముందస్తు నిర్ధారణ, ఆధునిక సాం కేతి క త, బహుళ విభాగాల వైద్యుల సమన్వ యం తో ఇలాంటి క్లిష్టమైన కేసులకూ విజయవంతమైన చికిత్స సాధ్యమవుతుందన్నారు.






