ఆశీర్వదించండి.. అభివృద్ధి నా బాధ్యత
కల్వకుర్తి ఫిబ్రవరి 6 : కల్వకుర్తి మున్సిపాలిటీ 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుల లలిత తమకు ఓటుతో ఆశీర్వదిస్తే కాలనీల్లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటిని పలకరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడతానని స్పష్టం చేశారు. కల్వకుర్తి , పురపాలిక లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.






