9 March, 2026 | 12:01 PM

ఒక్కసారి అవకాశం ఇవ్వండి..

07-02-2026 01:14 AM

అభివృద్ధి ఏంటో చూపిస్తా.. 

19 వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పాట్య తిరుపతయ్య 

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 6 : వార్డులోని ప్రతి సమస్య తెలిసిన వ్యక్తిగా మీ అందరిలో ఒకడిలా ఉన్న నాకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి మీ కండ్ల ముందు ఉంచుతానని 19 వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పాట్య తిరుపతయ్య అన్నారు. శుక్రవారం 19 వ వార్డులో నిర్వహించిన ప్రచారానికి వార్డు ప్రజల నుండి అన్యూహ స్పంద న లభించింది. వార్డులోని ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చిన తన సమస్య లాగా భావించి కుటుంబసభ్యుడిలా పని చేసే నీ లాంటి వ్యక్తి వెంబడి తమంటా ఉన్నామని అభ్యర్ధికి వార్డు ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా 19 వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పాట్య తిరుపతయ్య మాట్లాడుతూ వార్డు ప్రజలందరు నా కుటుంబ సభ్యులు అని ఎవరికీ ఏ కష్టం వచ్చిన ఆపద వచ్చిన తాను ఎల్లపుడు ముందు వరుసలో ఉంటానన్నారు. తనకు ఒకసారి ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకుని పోతానని ప్రభుత్వం తరుపున అమలు ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆపిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని 19 వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పాట్య తిరుపతయ్య వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు.