హృదయగత తిరుగుబాటు అనుమంద్రం
06-05-2024 12:05 AM
మనసు లోలోపల మనిషి చేసే నిరంతర అంతర్, బహిర్ ప్రయాణపు అలజడి జాడలు, జాడల ఛాయలు శశిశ్రీ కవిత్వం. లోకం ఆసాంతం తనలో, తానేమో తనకు వెలుపల ఉన్న సంగతిని ఈ కవి స్వీయానుభవం నుంచి గ్రహించింది. జీవన వైరుధ్యాన్ని ఔపోసన పట్టిన ఫలితంగా, దానిని అధిగమించే క్రమంలో విరోధాభాస కవిత్వానికి జన్మనిచ్చింది. కళా/కవితా స్పర్శ కొరవడి ముతక గద్యంగా మారిపోయిన లోకం మీద కవి ప్రకటించిన హృదయగత తిరుగుబాటు ఇది.
అంబటి సురేంద్ర రాజు
అనుమంద్రంలో కవితలు మనిషికి తానేమిటో తెలుసుకునేలా చేసే పాఠ్యగ్రంథాలు. రాళ్ళబండి శశిశ్రీ ఊహా శాలిత్వం ఈ కవితల్లో అబ్బుర పరుస్తుంది. ఎంచుకున్న అంశాన్ని కవిత్వం చేయడం ఎలానో, నేర్పుగా పదాల్ని కవితలో జొప్పించడం ఎలానో తెలిసిన కవి. ఆమె కవిత్వానికి జయహోలు.
కవి యాకూబ్






