19 May, 2026 | 12:04 PM

డాక్టరేట్ పొందిన మండల వాసి..

19-05-2026 10:19 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే18: మండల పరిధిలోని కోడూరు గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది,అగ్రశ్రేణి ఆడిటర్ మరియు టాక్స్ ప్రాక్టీషనర్ మారోజు బ్రహ్మచారి చెన్నైలోని యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నుండి కామర్స్ విభాగంలో నైపుణ్యత సాధించినందుకు గాను సోమవారం యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను అందజేశారు.లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ,వృత్తిపరమైన విజయాలు సాధించిన బ్రహ్మచారి మాట్లాడుతూ వాణిజ్య రంగంలో చేస్తున్న సేవలకు గాను గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు.తనకు అవార్డు ప్రకటించి,అందజేసిన యూనివర్సిటీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.డాక్టరేట్ అందుకున్న బ్రహ్మచారిని గ్రామస్తులు,పలువురు అభినందించారు.