లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి
సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గణేష్
మంథని, ఏప్రిల్ 1(విజయ క్రాంతి) కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను నిరసిస్తూ సిఐటియు ఇతర కార్మిక సంఘాలు ఇచ్చిన బ్లాక్ డే పిలుపులో భాగంగా ఈరోజు మంథనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లాకార్డ్ లు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మంద బలంతో పార్లమెంట్లో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, ఈరోజు ఏప్రిల్ ఒకడి నుండి అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుందని,
లేబర్ కోడ్లు అమలు అయితే కార్మికులు బానిసత్వంలోకి వెత్తివేయబడతారని, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చి కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే ఈ విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్ ల పై అసెంబ్లీ చర్చించి లేబర్ కోడ్ ల ను రాష్ట్రంలో అమలు చేయమని, తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. లేబర్ కోడ్ ల కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అభ్యుదయవాదులు గళం విప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మల్లేష్, సింగారపు గట్టయ్య, రాజయ్య, పోచమ్మ, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు




