14 June, 2026 | 5:41 PM

ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం

14-06-2026 04:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నాయుడువాడలో ఆదివారం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. వాడకట్టు ఆడబిడ్డలు అందరూ ఒక చోట చేరుకుని సంతోషంగా ఉల్లాసంగా ఐక్యతను చాటుతూ సంబరం చేసుకున్నారు . పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లి కొన్ని ఏళ్లు గడిచినా, సుమారు 120 మంది వాడ కట్టు ఆడవారు, ఆడబిడ్డలు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఈ ఐక్యత సమ్మేళనంలో బంధువులు, స్నేహితులు, పక్కపక్కని ఇంటి వారంతా ఒకరినొకరు కలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. చిన్నప్పటి ఆటలు, పాటలు, ఊరి కథలు, కుటుంబ జ్ఞాపకాలు తదితర అనేక సంఘటనలు మళ్లీ సజీవంగా తీసుకొచ్చారు. కొంతమంది విదేశాలు, ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమానికి హాజరై వైభవం పెంచారు.

ఆధునిక జీవన విధానంలో కూడా కుటుంబ బంధాలు, సాంప్రదాయిక విలువలు కాపాడుకోవాలని అందరూ ఒక్కటైన అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లలు తమ అమ్మమ్మలు, అత్తలు, పిన్నులతో కలిసి ఆనందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సమావేశం ద్వారా వాడ కట్టు మహిళల ఐక్యత మరింత బలపడిందని అందరూ సంతోషం వ్యక్తం చేశారు.