14 June, 2026 | 6:43 PM

కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకే కుట్రలు

14-06-2026 05:41 PM

ఆ ఆడియో నాది కాదు నకిలీ ది

మహేష్ కుమార్ గౌడ్ తనకు  తమ్ముడు లాంటి వారు

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్ పై షబ్బీర్ అలీ వివరణ

క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన షబ్బీర్

కామారెడ్డి, జూన్ 14 (విజయక్రాంతి): ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ స్పందించారు. ఆ  ఆడియో క్లిప్ నకిలీదని, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని ఉద్దేశంతో కొందరు పక్కా ప్లాన్ తో  కుట్రలకు లేపారన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనకు తమ్ముల్లాంటి వాడని అన్నారు. క్రమశిక్షణ కమిటీ పంపిన లేక కు ఆయన ఆదివారం వివరణ ఇచ్చారు. సమాజంలో పార్టీలో ఉన్న తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు పన్ను తున్నారని  అన్నారు. త్వరలోనే కుట్ర దారులను బయటపెడతామన్నారు. ఎక్కడ తాను మహేష్ గౌడ్ గురించి తప్పుడు మాట్లాడలేదన్నారు.

మా ఇద్దరి మధ్య దూరం పెంచేందుకే కుట్ర  పన్నారని అన్నారు. నాపై వస్తున్నా ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. క్రమశిక్షణ కమిటీ నాకు వివరణ కొరకు ముందే నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. తనపై అవస్థ వాలు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ డ్యామేజి కు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని న్యాయా నిపుణుల సలహాలు కోరుతున్నట్లు తెలిపారు. తాను 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను అని అన్నారు. పార్టీకి నష్టం జరిగే పని తాను ప్రాణం పోయే వరకు  చేయనని అన్నారు.