కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం
11-05-2026 02:04 AM
‘బండి’ కొడుకు కేసే నిదర్శనం
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం నడుస్తుందని మాజీమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్తే కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుమ్మ క్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.






