ఫీబిల్ సిటీ రోడ్డు నిర్మాణానికి గ్రహణం
- నిర్లక్ష్యం @ జీహెచ్‌ఎంసీ రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయం
- నిర్లక్ష్యం అధికారులదా? కాంట్రాక్టర్‌దా?
- ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ భూమి పూజ చేసి ఏడాదిన్నర కవస్తున్న పూర్తికాని రోడ్డు నిర్మాణం
రాజేంద్రనగర్ మే 4 (విజయక్రాంతి) : అభివృద్ధి పనుల విషయంలో జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లుగా నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ గత ఏడాదిన్నర కాలంగా రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2025 సంవత్సరంలో బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సమయంలో సాధన మెడికల్ కాలేజ్ సమీ పంలోని ఫెబిల్ సిటీ రోడ్డు పూర్తిగా వర్షం నీటికి గుంతలు పడి రోడ్డు అధ్వానంగా తయారు కావడంతో అప్పట్లో మున్సిపల్ జర్నల్ ఫండ్ నుండి రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో ప్రధాన రోడ్డు నుండి ఫిబిల్ సిటీ వరకు దాదాపు 900 మీటర్ల పొడవున రోడ్డు నిర్మించాలి.
ఇందులో 90 మీటర్లు సిసి రోడ్డు మిగత ది దాదాపు 800 మీటర్లు బీటీ రోడ్డు నిర్మించాలి. కానీ అధికారులు ఏడాదికాలంగా పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో పలుమార్లు ‘విజయక్రాంతి’ దినప త్రికలో రోడ్డుపై కథనాలు రావడంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారులను హెచ్చరించడంతో స్పం దించిన జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు గత రెండు నెలల క్రితం 90 మీటర్ల సిసి రోడ్డును నిర్మించారు కానీ బీటీ రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఫీబిల్ సిటీ రోడ్డంతా గుంతల మయమై ప్రయాణానికి నరకంగా మారింది . రోడ్డుకు ఇరువైపులా కంకర ను పరిచినప్పటికీ రోడ్డు వేయడంలో పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం గా విధులు నిర్వహిస్తున్నారు .
ఈ పని పట్ల అధికారుల నిర్లక్ష్యమా ..?కాంట్రాక్టర్ తప్పిదమా ..? అనే ప్రశ్న తలెత్తక మానదు 2025 సెప్టెంబర్ 15 వ తేదీన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు అప్పటినుండి నత్త నడకన పనులు సాగుతున్నాయి . నిధులు పుష్కలంగా ఉన్న కేవలం 900 మీటర్ల పొడవున కాంట్రాక్టర్ తో రోడ్డు వేయించలేని స్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారంటే అభివృద్ధిపై వారికి ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
అర్‌ఎంసీ రేటు పెరగడంతో నిలిపేసిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం
ఆర్‌ఎంసి రేటు పెరిగినందున కాంట్రాక్టర్ బీటి రోడ్డు వేయడానికి ముందుకు రావడం లేదు అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా బిటి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఏ ఈ నాగిరెడ్డి తెలిపారు.
నాగిరెడ్డి, ఏఈ






