5 May, 2026 | 2:02 AM

రేవంత్ పాలనలో నేరాల్లో రాష్ర్టం నంబర్ వన్

05-05-2026 12:41 AM
  1. సీఎం ప్రైవేట్ ఆర్మీగా పోలీసులు 
  2. పట్టపగలు చోరీ, కాల్పులు జరిగితే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తున్నాయి?
  3. బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులతో పైశాచితక ఆనందం
  4. వేధింపు రాజకీయాలు మానకుంటే గుణపాఠం తప్పదు 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  6. కరీంనగర్‌లో దొంగల కాల్పుల్లో గాయపడ్డ వారికి పరామర్శ

కరీంనగర్/సంగారెడ్డి, మే 4 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి పాలనలో నేరాల్లో రా ష్ర్టం నంబర్ వన్‌గా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం ప్రైవేట్ ఆర్మీగా పోలీసులు పనిచేస్తున్నారని, పట్టపగలు దుండగులు కాల్పులు జరిపి చోరీకి పాల్పడితే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఆదివారం దొంగల కాల్పుల్లో గాయపడ్డ వారిని సోమవారం కేటీఆర్ పరామర్శించారు. చోరీ జరిగిన పీఎంజే జ్యువెలరీ షాపును పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటి, నేరాల్లో బీహార్, యూపీతో పోటీపడే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పట్టపగలే దుండ గలులు దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి, చోరీ చేస్తే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. నేరాలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు. ఘటన జరిగి 36 గంటలు అయినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. అధునాతనమైన పరి జ్ఞానం మీ చేతిలో ఉన్నా ఒక్కరిని కూడా పట్టుకోని చేతగాని ప్రభుత్వంగా మారిందన్నారు.

మా ఇంటిమీదికి హ్యాకర్లను పంప డం కాదు, మా సీసీ కెమెరాలను హాక్ చేయ డం కాదు, బీఆర్‌ఎస్ నేతలపై పసలేని కేసు లు పెట్టి ఆగం చేయడం కాదు చేతనైతే ప్రజ ల ప్రాణాలను కాపాడాలని సవాల్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి.. చర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు కలిసిన ఖైధీలకు ఏమైనా ఫ్రీడం ఇచ్చారేమోననే అనుమానం కలుగుతున్నదని ఎద్దేవా చేశారు. ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు వాటిని నియంత్రించా ల్సింది పోయి బీఆర్‌ఎస్ కార్యకర్తలనుపై కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ చందా నగర్లో చోరీకి పాల్పడితే ఇప్పటివరకు ఏం చేశారో తెలియదన్నారు. కోఠిలో ఏటీఎం వద్ద తుపాకులతో దాడి చేసి కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్తే చర్యలు లేవని విమర్శించారు. సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితే రీట్విట్ చేస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టడమేనా పోలీసుల పని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు శవాలు, శివాలు తప్ప మరొకటి తెలవదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం, రేవంత్‌రెడ్డిని బండి సంజయ్ ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. కాందిశీకుల భూముల్లో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు ఉన్నారు.

మన్నె క్రిశాంక్‌కు పరామర్శ

సంగారెడ్డి జైలులో నిర్బంధంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను సోమవారం కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాం గ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసు లతో నిర్బంధానికి గురి చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఆరోపించారు. పోలీసులు సీఎంకు ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తున్నారని, ఈ విధానం మం చిది కాదన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్ని స్తూ ప్రజల ముందుకు తీసుకువస్తున్నందుకే క్రిషా్ంప వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

నాలుగేళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితిలో, 12 రోజులుగా జైలు లో పెట్టి ‘హ్యాబిచువల్ అఫెండర్’గా చూపించడం దుర్మార్గం అని అన్నారు. క్రిశాంక్‌పై సుమారు 35 అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా సోషల్ మీడి యా పోస్టులపై కేసులు పెట్టడంలోనే బిజీగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఫోన్ ట్యా పింగ్, హ్యాకింగ్, జర్నలిస్టులపై వేధింపులు వంటి చర్యలు కొనసాగుతున్నాయి అని కేటీఆర్ అన్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా క్రిశాంకును అరెస్ట్ చేయ డం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.