నడి సముద్రంలో మునిగిన నౌక
25-12-2024 02:17 AM
ఇంజిన్ రూంలో పేలుడు కారణంగా ఘటన
14 మందిని కాపాడిన రెస్క్యూ టీం..
మరో ఇద్దరు గల్లంతు
మాస్కో, డిసెంబర్ 24: రష్యాకు చెందిన ఓ కార్గో నౌక ఇంజిన్‌లో పేలు డు సంభవించి మధ్యధార సముద్రం లో మునిగింది. సిరియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి తమ ఆయుధ సామగ్రిని రష్యాకు తిరిగి తీసుకురావాలని అక్క డి ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగా ఓ కార్గో నౌక ఈ నెల 11న సెయింట్ పిటర్స్‌బర్గ్స్ నుంచి సిరియాకు బయల్దేరింది. సోమవారం మధ్యధార సముద్రం గుండా నౌక వెళ్తుండగా ఇంజిన్‌లో పేలుడు సంభవించింది. నౌకను నడిపిస్తున్న 16 మంది సిబ్బందిని రెస్క్యూ టీం రక్షించగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. తర్వాత నౌక మెల్లగా సముద్రంలో మునిగిపోయింది.






