15 July, 2026 | 5:01 AM

అమెరికన్ ఎయిర్‌లైన్స్ సేవలకు అంతరాయం

25-12-2024 02:25 AM

క్రిస్మస్ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు

వాషింగ్టన్, డిసెంబర్ 24: సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) విమానయాన సేవలను పూర్తి గా నిలిపివేసింది.

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, తిరిగి సర్వీసులను నడుపతామని ప్రకటించింది. అప్పటివరకు ప్రయాణికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలు ఉం టాయి. ఎఫ్‌ఏఏ సాధారణ విమాన సర్వీసుల కంటే అదనంగా సర్వీసులు పెంచాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపో వడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.