అమెజాన్ పార్సిల్‌లో పాము
20-06-2024 01:19 AM
బెంగళూరు, జూన్ 19: బెంగళూరులో ఓ కుటుంబానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో ఓ వస్తువు ఆర్డర్ ఇవ్వగా, ఇంటికి చేరిన పార్సిల్‌లో పాము కనిపించింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లయిన ఓ జంట అమెజాన్ యాప్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ కోసం ఆర్డర్ ఇచ్చారు. ఇంటికి వచ్చిన పార్సిల్‌ను తెరిచి చూడగా అందులో ప్రమాదకరమైన కోబ్రా పాము పిల్ల కనిపించింది. దీంతో వారు భయబ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ పాము పాక్సిల్ టేప్‌లో ఇరుక్కుపోవటంతో కాటేయలేకపోయింది.






