16 July, 2026 | 12:42 PM

కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

20-06-2024 01:19 AM

న్యూఢిల్లీ, జూన్ 19: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడించింది. మంగళవారంతో జ్యుడిషయల్ కస్టడీ ముగియడంతో జైలు అధికారులు వారిద్దరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తుల ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది లిక్కర్ స్కాం కేసు పూర్తిగా కేజ్రీవాల్‌తో ముడిపడి ఉన్నదని వాదించారు. అందుకు కేజ్రీవాల్‌తో పాటు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును అభ్యర్థించారు. అందుకు కోర్టు అంగీకరించి వారిద్దరి కస్డడీని పొడిగించింది.