16 July, 2026 | 12:21 PM

కువైట్ మృతులకు 12 లక్షల పరిహారం

20-06-2024 01:20 AM

న్యూఢిల్లీ, జూన్ 19: బతుకుదెరువు కోసం వెళ్లి కువైట్‌లోని మంగాఫ్ పట్టణంలో అగ్నిప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కాస్త సాంత్వన కలిగించే వార్త చెప్పింది కువైట్ ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు దాదాపు రూ.12.5 లక్షల (15 వేల డాలర్లు) చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపింది. ఏడంతస్తుల భవనంలో విద్యుత్తు షాట్‌సక్య్రూట్ కారణంగా మంటలు అంటుకోవటంతో 49 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో 45 మంది భారతీయులే ఉన్నారు. వీరి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్టు అరబ్‌టైమ్స్ పత్రిక తెలిపింది. మృతుల కుటుంబాలకు వారి దేశాల రాయబార కార్యాలయా ద్వారా ఈ పరిహారం అందివ్వనున్నట్టు పేర్కొన్నది.  భారత ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కేరళకు చెందిన మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.