హ్యూమన్ టచ్‌తోనే పాటకు జీవం
హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘గోదారి గట్టు’ పాట ఇప్పటికే 27 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రమణ గోగుల పాడిన ఈ పాట సోషల్ మీడియాతోపాటు అన్నీ మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రమణ గోగుల మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
* ‘గోదారి గట్టు’ ఆల్రెడీ 27 మిలియన్ వ్యూస్ దాటేసింది. -చాలా గ్రేట్ ఫుల్‌గా ఉంది. నా పాటను అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు. మళ్లీ నేనెప్పుడు పాడుతానా అని ఎదురుచూశారు. నేనిప్పుడు వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయా. -నేను ఇంత కాలం అబ్రాడ్‌లో మల్టీ నేషనల్ కంపెనీస్‌కి వర్క్ చేశాను, నాకు టెక్నాలజీ చాలా ఇష్టం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా ఎనలిటిక్స్ ప్రాజెక్ట్స్‌లో చేశా. అందుకే గ్యాప్ వచ్చింది.
* నేను ఎవరి సంగీతంలోనూ ఇప్పటివరకు పాడలేదు. కానీ అనిల్, భీమ్స్ చాలా ప్రేమగల్ల మనుషులు. వెంకటేశ్ గారు నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ నా తొలి సినిమా. ఇలాంటి మంచి కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాట కాబట్టి పాడేందుకు ఒప్పుకు న్నా. భీమ్స్ హృద్యం గా స్వపపరిచారు. ఆయన కాల్ చేసి తప్పకుండా పా డాలని కోరారు. పాట పంపించమ ని అడిగా.. రెండు సార్లు విన్నా. సాం గ్‌లో ఒక హార్ట్ ఉం ది. కచ్చితంగా పా డాలనిపించింది. దీన్ని పాడటానికి చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ దొరికింది. -మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. నా వాయిస్‌కి తన వాయిస్‌కి పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అయింది. భాస్కర భట్ల పెంటాస్టిక్‌గా రాశారు.
* -ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందం ఇచ్చింది. ఓ వ్యక్తి ఫోన్ చేసి మా ఊర్లో పొద్దున లేస్తే ఇదే పాట వేస్తున్నారు.. అందరూ డాన్స్ చేస్తున్నారని చెప్పడం చాలా ఆనందాన్నిచ్చింది. -వెంకటేశ్ కాల్ చేసి, నేను మళ్లీ పాట పాడడం ఆనందంగా ఉందని చెప్పారు.
* మళ్లీ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి -నేను సిద్ధంగా ఉన్నా. అయితే అన్నీ కుదరాలి. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ చాలా అద్భుతంగా సంగీతం చేస్తున్నారు. అయినా ఒక న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. నా దగ్గర కొన్ని వినూత్నమైన ఐడియాలున్నాయి.
* అప్పటికి ఇప్పటికీ మ్యూజిక్ టెక్నాలజీలో -చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అసలు ఒక సింగర్ పాట పాడాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్‌గా సాంగ్ వస్తుంది. అయితే ఒక పాటకు హార్ట్ అనేది ముఖ్యమైన అంశం. అది హ్యూమన్ టచ్‌తోనే సాధ్యమవుతుంది.






