8 July, 2026 | 10:05 PM

ఓవర్ థింకింగ్ కాన్సెప్ట్‌తో లీలావినోదం

18-12-2024 12:00 AM

షణ్ముఖ్ జస్వంత్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘లీలా వినోదం’. పవన్ సుంకర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అనగ అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీఅక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మారిసా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈటీవీ విన్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ.. “నాకు కరెక్ట్ టైంలో ‘లీలా వినోదం’ వచ్చింది.

ఇది మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది” అన్నాడు. ‘లీల పాత్ర కోసం భరత్ గారు నన్ను సంప్రదించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. షణ్ముఖ్ చాలా సపోర్ట్ చేశారు’ అని హీరోయిన్ అనగ అజిత్ చెప్పింది. డైరెక్టర్ పవన్ సుంకర మాట్లాడుతూ.. ‘ఉషా కిరణ్ మూవీస్‌లో డైరెక్టర్‌గా పరిచయం కావడం ఒక గొప్ప అదృష్టం. ‘లీలా వినోదం’లో ఓవర్ థింకింగ్ అనే కాన్సెప్ట్‌ను చూపిస్తున్నాం.

అందరూ రిలేట్ అవుతారు. చాలా మెమోరీస్ గుర్తు చేస్తుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీధర్, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, మిర్చి ఆర్జే శరన్, నటులు మదన్, శివ, చిత్రబృందం పాల్గొన్నారు.