8 July, 2026 | 11:47 PM

డేట్స్ ఇచ్చేశారట

17-12-2024 12:00 AM

రాజమౌళి కాంబో చిత్రం కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం లోకేషన్ వేటలో ఉన్నానంటూ రాజమౌళి పోస్ట్ పెట్టడంతో ఇంకేముంది షూటింగ్ ప్రారంభం కాబోతోందని అంతా అనుకున్నారు. కానీ షూటింగ్ ప్రారంభం కాలేదు సరికదా.. ఆ ఊసే లేదు. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర వార్త ఒకటి వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి అయితే కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మహేశ్ మూవీపై రాజమౌళి దృష్టి పెడతారట. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం సంక్రాంతి తరువాత ప్రారంభమవుతుందని టాక్. సంక్రాంతి తర్వాత రాజమౌళికి మహేశ్ డేట్స్ ఇచ్చారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో సెట్ వేశారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌ని రాజమౌళి ఇక్కడే ప్రారంభిస్తారట. సినిమా ఓపెనింగ్ రోజునే పూర్తి అప్‌డేట్స్ ఇచ్చేందుకు రాజమౌళి ఏర్పాట్లు చేసుకుంటున్నారట.