3 April, 2026 | 1:30 PM

Breaking News

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •   కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్   •   Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ   •   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట   •   ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా భూక్యా రవి కుమార్ నాయక్   •   కోనరావుపేట గ్రామసభ రసభస   •  

బావిలో పడి విద్యార్థి మృతి

01-12-2024 07:15 PM

అనంతగిరి (విజయక్రాంతి): మండల పరిధిలోని శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గుగులోత్ తిరుమలేష్ బావిలో పడి చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం నక్కగూడెంకు చెందిన తిరుమలేశ్ తరుణ్ లు ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో విద్యార్థులకు ట్యూషన్ చెప్పే శాంతినగర్ గ్రామానికి చెందిన వీరబాబు పొలం పనుల నిమిత్తం ఇద్దరినీ తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం ఈత కొడదామని బావి దగ్గరకు వెళ్లారని వీరబాబు బావిలోకి దిగిన అనంతరం తిరుమలేష్ ను కూడా దూకమని చెప్పాడంతో బావిలోకి దూకిన తిరుమలేష్ నీళ్లలో మునిగిపోవడంతో వీరబాబు కేకలు వేసినప్పటికీ చుట్టుపక్కల వారు వచ్చే సరికి చనిపోయినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.