3 April, 2026 | 3:36 PM

Breaking News

సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి.. జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •  

ఆశా వర్కర్ల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

01-12-2024 07:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఆశా వర్కర్ల సంఘం సిఐటియు జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు పేర్కొన్నారు. పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఇటీవలే మూడవ జిల్లా మహాసభలను నిర్మించారు. అందులోని భాగంగానే నూతన కార్యవర్గంపై తీర్మానం చేసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా సుజాత, ప్రధాన కార్యదర్శిగా గంగామణి, కోశాధికారిగా రామలక్ష్మీ ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా చంద్రకళ, ఇంద్రమాల, సవిత, అనురాధ, మౌనిక, తదితరులను ఎన్నుకున్నారు. ఆశ వర్కుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు వెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.