చెరువులో జారిపడి విద్యార్థి మృతి
పటాన్‌చెరు, మే 22 (విజయక్రాంతి) : స్నేహి తులతో కలిసి చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన విద్యార్థి చెరువులో పడి మృతి చెందిన ఘటన జిన్నారం మండలం వావిలాల గ్రామంలో జరిగింది. జిన్నారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మనూర్ మండలం పుల్కు ర్తి గ్రామానికి చెందిన శివకుమార్ (20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 20న మెదక్‌లో తన స్నేహితు ని అన్న వివాహానికి వెళ్లాడు. వివాహం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా తన స్నేహితుని అమ్మమ్మగారి ఇంటి కి స్నేహితులంతా కలిసి వచ్చారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం వావిలాల గ్రామ శివారులోని పీర్షా చెరు వులో స్నానం చేసేందుకు స్నేహితులందరూ కలిసి వెళ్లారు. స్నేహితు లు స్నానం చేస్తున్న క్రమంలో శివకుమా ర్ కాలు జారి ప్రమాదవశాత్తు జేసీబీ గుంతలో పడిచనిపోయాడు. మృతు డి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.






