మంజీరా నదిలో పడి వ్యక్తి మృతి
23-05-2024 06:46 AM
నర్సాపూర్ (చిలిప్‌చేడ్), మే 22 : మంజీరానదిలో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలం ఫైజాబాద్‌లో చోటు చేసుకుంది. చిలిప్‌చేడ్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఫైజాబాద్ గ్రామానికి చెందిన తలారి రాజు(44) ఫైజాబాద్ గ్రామ శివారులో పారుతున్న మంజీరానదిలో వలలు వేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. మృతు డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారు లు, కుమార్తె ఉన్నారు.






