ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు వినతి
ముషీరాబాద్, జూలై 15(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ నే షనల్ కాస్ట్ కోడ్ కేటాయించి, అదే కోడ్ ఆ ధారంగా కులగణన చేపట్టాలని కేంద్ర సా మాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేను కోరినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ(బీసీ జేఏసీ) రాష్ట్ర కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం తెలిపారు.
ఈ మేరకు బుధవారం కేంద్ర మంత్రిని కలిసి సమగ్ర వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఒకే కులానికి వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లు, స్పెల్లింగ్లు, స్థానిక ఉచ్చారణలు ఉండడం వల్ల కులగణనలో తప్పిదాలు జరి గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులు చామకూర రాజు, రాష్ట్ర ఇన్చార్జి కేవీ గౌడ్, బీసీ సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురాం, వెంకట్రామయ్య , బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ గంగపుత్ర వివిధ బీసీ సంఘాల నాయకులు, బీసీ జేఏసీ ప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.






