ప్రశాంత్‌రెడ్డి గృహ నిర్బంధం హక్కుల ఉల్లంఘనే
16-07-2026 12:23 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గృహనిర్బంధం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే అని, ప్రజా సమస్యలపై శాంతియుత దీక్షను అడ్డుకోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధంపై స్పందిస్తూ కేటీఆర్ సీఎం రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు.






