17 April, 2026 | 11:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

భావోద్వేగాల దండోరా

08-04-2025 12:00 AM

అగ్రవర్ణ అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఆ వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కు తున్న చిత్రం ‘దండోరా’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా, తాజాగా మేకర్స్ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించారు.

25 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో నటుడు శివాజీ సహా పలువురు నటులపై సన్నివేశాల ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి; సంగీతం: మార్క్ కే రాబిన్; ఎడిటర్: సృజన అడుసుమిల్లి; ఆర్ట్: క్రాంతి ప్రియం.