calender_icon.png 5 May, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్‌ఎఫ్ కమాండర్‌గా ఇమ్రాన్ హష్మీ

08-04-2025 12:00:00 AM

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇప్పటివరకు ఎక్కువగా రొమాంటిక్, యాక్షన్, డ్రామా చిత్రాల్లోనే కనిపించారు. కానీ ఇప్పుడు సరికొత్తగా శక్తివంతమైన బీఎస్‌ఎఫ్ అధికారి పాత్రలో మెప్పించేందుకు వస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ కథానాయకుడిగా తేజస్ దేవ్‌స్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్రౌండ్‌జీరో’. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, టాలిస్మాన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

కాసిమ్ జగ్మగియా, విశాల్ రాంచందానీ, సందీప్ సీ సిధ్వాని, అర్హన్ బగతి, అభిషేక్‌కుమార్, నిషికాంత్ రాయ్ నిర్మాతలు. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. కొన్ని రోజులుగా పోస్టర్లు, టీజర్ల ద్వారా సినీప్రియుల్లో ఆసక్తిని పెంచుతూ వస్తున్న మేకర్స్ సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

గత 50 ఏళ్ల బీఎస్‌ఎఫ్ చరిత్రలో అత్యుత్తమ ఆపరేషన్‌గా అవార్డు పొందింది 2015 మిషన్. ఈ నిజమైన మిషన్ నుంచి ప్రేరణ పొందుతూ వాస్తవ సంఘటనల ఆధారంగా యుద్ధ వాతావరణంలో ఈ సినిమాను రూపొందించారు.

ఇందులో ఇమ్రాన్ హష్మీ బీఎస్‌ఎఫ్ కమాండెంట్ నరేంద్రనాథ్ ధర్ దూబే పాత్రలో కనిపించనున్నారు. సాయి తమ్‌హంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పట్లో కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిని ఈ సినిమాలో చూపించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.