calender_icon.png 31 October, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలి

31-10-2025 12:43:14 AM

జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్

వనపర్తి, అక్టోబర్ 30 ( విజయక్రాంతి ) : వనపర్తి ఎమ్మెల్యే ప్రతిసారి అభివృద్ధి పనులకు వే యికోట్లు నిధుల తెచ్చామని చెప్తున్నారని నిధులకు సంబందించిన శ్వేత పత్రం విడుదల చేయాలని జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ లు అన్నారు. గు రువారం జిల్లా కేంద్రం లోని మాజీ మంత్రి నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వనపర్తి జిల్లా కేంద్రంలోకాంగ్రెస్ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి పనులు జరగలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందని అంటున్నారన్నారు.

మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిధులు తెచ్చి అభివృద్ధి చే స్తున్నాం అంటున్నారని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యేనే, మున్సిపాలిటీలో జరిగే టియు ఎఫ్ ఐ డి సి అమృత్ స్కీం టెండర్లు గత ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. రోడ్డు వెడల్పుల విషయం లో తాము అధికారంలో ఉన్న సమయంలో గతంలో ఎమ్మార్వో ఆఫీస్ నుండి రామాలయం వరకు అన్ని ఇళ్లను తొలగించామని కాంగ్రెస్ వాళ్లు దమ్ముంటే ఎమ్మార్వో ఆఫీస్ నుండి పాలిటెక్నిక్ వరకు ఇళ్ళను తొలిగించి రోడ్ల విస్తరణ చేయాలన్నారు.

మెయింటెనెన్స్ పనులు చేస్తూ రోడ్ల విస్తరణ జరుగుతుందని అబూత కల్పన కల్పించవద్దని, గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ,టౌన్ హాళ్లను కట్టించడం జరిగిందన్నారు. పార్టీలు మారినంత మాత్రాన జీవోలు మారవని వారు హితువు పలికారు . ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.