31-10-2025 12:44:01 AM
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోనే గోవుల అక్రమ రవాణా, గోహత్య, పశుమాంస ఎగుమతి పెద్ద మాఫియాగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణలోని కొన్ని ప్రాం తాల్లో పోలీసులు ధైర్యంగా చర్యలు తీసుకుంటే, వెంటనే ఎంఐఎం నాయకులు ఉన్న తాధికారులకు ఫోన్లు చేసి ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిపారు.
ఘట్కేసర్‌లో గోరక్షక్ సేవకుడు ప్రశాంత్ కుమార్ (సోనూసింగ్)పై మజ్లిస్ పార్టీ నాయకుడు ఇబ్రహీం ఖురేషీ తుపాకీతో కాల్పులు జరిపారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించిందన్నారు. దేశానికి, తెలంగాణకు మజ్లిస్ పార్టీ ఒక చీడపురుగు అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలోని అనేక అటవీ ప్రాంతాల్లో అక్రమ స్లాటర్ హౌసులు నడుస్తున్నాయని, హైదరాబాద్‌లోని న్యూ బోయిగూడ, గోల్నాక ప్రాంతాల్లో కూడా స్లాటర్ హౌసు లు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. గోరక్షణ చట్టాలను కచ్చితంగా అమలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించాలన్నారు.
గోవుల అక్రమ రవాణా సమయంలో పోలీసులు వాహనాలను సీజ్ చేస్తే, వాటిని విడిపించడానికి ఎంఐఎం పార్టీ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేశారని, బహదూర్‌పూరా ఎమ్మెల్యే మహ్మ ద్ ముబీన్, రసూల్‌పూరా కార్పొరేటర్ మహ్మద్ ఖాదర్ వంటి వారు రెగ్యులర్‌గా పోలీసు స్టేషన్లకు వెళ్లి అధికారులను బెదిరించి వాహనాలను విడిపించడం సాధార ణంగా మారిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టా రు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు కూడా అక్రమ స్లాటర్ హౌసుల్లో భాగస్వాములని, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, హజ్ కమిటీ మాజీ చైర్మన్ మహ్మద్ సలీం బీఆర్‌ఎస్ హయాంలో స్లాటర్ హౌస్ అక్రమాల ద్వారా వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.
దారుస్సాలాంలో ఎంపిక..
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక గాంధీభవన్‌లో జరగలేదని, దారుస్సాలాంలో జరిగిందని కిషన్‌రెడ్డి ఆరోపిం చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పాలన్నారు. మజ్లిస్ పార్టీని గతంలో కేసీఆర్ మోస్తే .. ఇప్పుడు ఆ బాధ్యతను రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి తీసుకున్నారని తెలి పారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ అభ్యర్థే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని తెలిపారు.
గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌ను ఇప్పుడు హడావుడిగా మంత్రిగా చేయాలని నిర్ణయించడంలో ఆంతర్యమేమిటీన్నారు. మైనారిటీ సంక్షేమంపై శ్రద్ధ ఉంటే ముందే అవకాశం ఇచ్చేవారని, ఎన్నికల ముందు గుర్తుకొచ్చిందా..? అని కిషన్‌రెడ్డి నిదీశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు.