16 July, 2026 | 11:23 AM

లారీ ఢీకొని మహిళ మృతి

22-09-2024 02:11 AM

మేడ్చల్, సెప్టెంబర్ 21: లారీ ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. మేడ్చ ల్ బస్టాండ్ ఎదుట శనివారం ఉదయం రోడ్డు దాటుతున్న రాగం జ్యోతి (32) అనే మహిళను హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొనగా అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా లారీని నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.