20 May, 2026 | 10:39 AM

మంటలు అంటుకొని మహిళ మృతి

10-11-2024 12:48 AM

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 9: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని మహిళ మృతిచెందిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌లోని రంగనాయకుల గుట్టకు చెందిన ఒగ్గుల లలిత (45), ఆమె భర్త వెంకటేశ్ చెత్తను సేకరిస్తూ, అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బ్రిలియంట్ కాలేజీ వెనుక వైపు ఉన్న జనహర్ష వెంచర్‌లో చెత్తకుప్పల వద్ద రాగి తీగల కోసం వైర్లను కాలుస్తున్న క్రమంలో చీరకు మంటలు అంటుకొని లలిత అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ అంజిరెడ్డి తెలిపారు.