కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు ఏడాది
పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి
గుంటూరు, జూన్ 4 (విజయక్రాంతి): మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనకు ఏడాది పూర్తి అయిందని వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అం బటి మురళి విమర్శించారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు బుధవా రం నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని దుర్మార్గమైన పాల న అందిస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇటువంటి పాలనను ఎప్పుడూ చూడ లేదని తెలిపారు. తాము తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమాల ద్వారానైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మొద్దు నిద్ర నుంచి మేల్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ నేతృత్వంలో నిరంకుశ, అరాచక వి ధానాలను ప్రజలకు పరిచయం చేయడమే తప్ప సంక్షేమం శూన్యమన్నారు.
ప్రభుత్వ వై ఫల్యాలను ప్రశ్నించకుండా ఉండేందుకు రా ష్ట్రంలో భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో మాట్లా డితే సూపర్ సిక్స్ అన్నారని, సంపద సృష్టిస్తానని చెప్పారని, పేదల బతుకుల్లో వెలుగు లు నింపుతానంటూ ప్రగల్భాలు పలికి నేడు నిధులు లేవు, చెయ్యలేను అని చెప్పటం బాబుకే చెల్లిందన్నారు.
రాబోయే రోజుల్లో ప్రజ లే గుణపాఠం చెపుతారని తెలిపారు. అనంతరం స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయళ్దేరి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.






