31 August, 2026 | 6:41 PM

Breaking News

ఎన్నికల హామీలు అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా   •   సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి   •   లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి   •   అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్   •   చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన   •   పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి   •   అభివృద్ధిలో కరీంనగర్‎ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్   •   శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి   •   రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.   •  

గంజాయి మత్తులో యువకుడి వీరంగం

27-11-2024 07:51 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా సమీపాన గల టిటిడి వద్ద గంజాయి సేవించిన ఒక యువకుడు అటుగా వెళుతున్న మరో యోగంపై దాడి చేసి గాయపరిచాడు. అడ్డుకున్న స్థానికులను బెదిరించడమే కాక వారి వాహనాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకొని సంఘటన స్థలాన్ని చేరుకున్న బ్లూ కోర్ట్ పోలీసులను చూసి అతని స్నేహితులు అక్కడి నుండి ఆటోలో తీసుకెళ్లారు. గంజాయి మత్తులో యువకుడు చేసిన చేష్టలు అందర్నీ భయాందోళనకు గురిచేసింది.