ప్రశాంత్‌నగర్ ప్రధాన రహదారిలో జీబ్రా సిగ్నల్ ఏర్పాటు చేయాలి
కూకట్ పల్లి, జూన్ 9 (విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గ పరిధి ప్రశాంత్ నగర్ ప్రధాన రహదారిపై జీబ్రా సిగ్నల్ ఏర్పాటు చేయాలని మంగళవారం కూకట్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు. మూసాపేట వై జంక్షన్ నుండి బాలానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని, గతంలో ఈ ప్రాంతంలో జీబ్రా సిగ్నల్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం కూడా ఇచ్చామని సిపిఐ నాయకులు కృష్ణ తెలిపారు.
ఈ ప్రాంతము ఇండస్ట్రియల్ ప్రాంతమైనందున చుట్టుపక్కల పరిశ్రమలు ఉన్నందున సమీప కాలనీలు రాజీవ్ గాంధీ నగర్, శ్రీశ్రీ నగర్, ఇందిరానగర్ తదితర కాలనీవాసులు ప్రతినిత్యం రోడ్డు దాటుకుంటూ పరిశ్రమలలో పనిచేయడానికి వెళుతుంటారన్నారు. ప్రధాన రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రమాదంతో కూడుకున్నదని ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే రహదారిపై ఫుటోవర్ బ్రిడ్జి లేదా జీబ్రా సిగ్నల్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సిపిఐ మండల కార్యదర్శి జి కృష్ణతోపాటు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు పాల్గొన్నారు.






