వీధి కుక్కల దాడిలో 20 గొర్రెపిల్లలు మృతి
10-06-2026 12:44 AM
యాదగిరిగుట్ట, జూన్ 9 : యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త గుండ్లపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడిలో 20 గొర్రెపిల్లలు మృతి చెందాయి. మంగళవారం జరిగిన దాడిలో ముక్కెర్ల స్వామికి చెందిన 20 గొర్రె పిల్లలు మృతిచెందాయి. ఘటనా స్థలాన్ని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణీభరత్గౌడ్, కమిషనర్ బి.శ్రీనివాస్, కౌన్సిలర్లు పేరబోయిన సత్యనారాయణ, ముక్కెర్ల మల్లేష్ పరిశీలించారు. గొర్రె పిల్లలు మృతితో బాధితుడు తీవ్రంగా నష్టపోయాడని, ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. ప్రభుత్వ పరంగా అందాల్సినవన్నీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ హామీ ఇచ్చారు.






