10 August, 2026 | 10:11 AM

భద్రాచలం పట్టణంలో "అభయ డే" ర్యాలీ

10-08-2026 09:02 AM

డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా గైనకాలజిస్ట్ సంఘం ఆధ్వర్యంలో  ర్యాలీ  

భద్రాచలం,(విజయక్రాంతి): వెస్ట్ బెంగాల్లో డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలని హత్య చేయటాన్ని నిరసిస్తూ, ఆమె చనిపోయి సంవత్సరం అయిన సందర్భంగా, అలాగే గైనకాలజిస్ట్ లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ  భద్రాచలం పట్టణంలో అబయ్  డే  పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం జిల్లా గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గైనకాలజిస్ట్ సంగం నాయకులు డాక్టర్ జయ భారతి, చల్లగుల్ల స్పందన, డాక్టర్ సరోజ, డాక్టర్ భార్గవి, డాక్టర్ పూజ, డాక్టర్ అలీనా తోపాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.