10 August, 2026 | 10:09 AM

అత్యంత వైభవంగా బోనాల పండుగ

10-08-2026 09:03 AM

ఘట్ కేసర్, ఆగస్టు 9  (విజయక్రాంతి) : బోనాల పండగను ఆదివారం ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎఫ్ సి నగర్, చందుపట్లగూడ, బొక్కొనిగూడ, శివారెడ్డి గూడ, మారుతి నగర్ శ్రీనిధి నెస్ట్, అలాగే పోచారం  డివిజన్ పరిధిలోని చౌదరిగూడ, వెంకటాపూర్, స్వర్ణ గిరి కాలనీ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు మహిళలు నైవేధ్యంతో కూడిన బోనాలతో శివసత్తుల పూనకాలతో వెంటరాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి అమ్మవారి ఆలయాలకు చేరుకుని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరు కోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి.

ఈ బోనాల ఉత్సవంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాజీ ప్రజా ప్రతిని ధులు, నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం యువకులు తీసిన తొట్టెల, పలహారపుబండి ఊరేగింపులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.