10 August, 2026 | 10:11 AM

ముర్కుంజాల్‌లో 20 నూతన విద్యుత్ లైట్ల ఏర్పాటు

10-08-2026 09:04 AM

-గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.సర్పంచ్ అనూష లాల్‌కుమార్

కంగ్టి,(విజయక్రాంతి): మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలో 20 నూతన విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ సారంగి అనూష లాల్‌కుమార్ తెలిపారు.వర్షాకాలంలో కొన్ని విద్యుత్ బల్బులు పనిచేయకపోవడంతో గ్రామంలోని పలు కాలనీల్లో సమస్య ఏర్పడిందని, విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి పాడైన బల్బులను తొలగించి కొత్త విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఈ విడతలో మొత్తం 20 నూతన లైట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.