6 July, 2026 | 9:20 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

అభిషేక్ సింఘ్వీ, నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు

05-03-2026 11:25 AM

కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు

రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికలకు(Rajya Sabha elections) కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Singhvi), వేం నరేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి సమర్పించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నేతృత్వంలో నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజ్యసభలో రెండోసారి అవకాశం లభించడం తన అదృష్టమని అభిషేక్ సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లకు  అభిషేక్ మను సింఘ్వి కృతజ్ఞతలు తెలిపారు.

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) అగ్ర నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ సింఘ్వీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. చర్చలు, సంప్రదింపుల తర్వాత వేం నరేందర్ రెడ్డి పేరును కూడా ఖరారు చేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆయనను కోరారు. అంతకుముందు, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా బీ ఫారాలను అందజేశారు.