సంగారెడ్డిలో జగ్గారెడ్డి హోలీ సంబరాలు
05-03-2026 02:42 AM
యువతను ఉర్రూతలూగిస్తూ స్టెప్పులు
సంగారెడ్డి, మార్చి 4(విజయక్రాంతి):హోలీ పండగ సందర్భంగా బుధవారం నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రామ మందిర్ కమాన్ వద్ద వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పట్టణ ప్రజలతో రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ అలరించారు.
ప్రతీ పండుగకు జగ్గారెడ్డి తన మార్క్ను చూపిస్తుంటారు. మాస్ లీడర్గా పేరుగాంచిన ఆయన స్థానిక ప్రజలతో తన సంతోషాన్ని పంచుకుంటారు. అందులో భాగంగానే హోలీ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాటలకు స్టెప్పులు వేస్తూ యువతను ఉర్రూతలూగించారు.




