ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?
06-07-2026 09:11 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పక్కన మురికి కాలువ పిచ్చి మొక్కలతో చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ మురికి కాలువ శుభ్రం చేయకపోవడంతో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం నిండిపోయి ఉండడంతో వర్షపు నీరు, ఆశ్రమ పాఠశాల నుండి వచ్చే నీరు నిలిచి ఉండడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీ ప్రజలు తెలుపుతున్నారు.
ఇట్టి విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇట్టి విషయమై గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేసి ప్రజల సమస్యను తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.






