4 August, 2026 | 1:52 AM

వర్షాలు కురవాలని శివుడికి జలాభిషేకం

04-08-2026 12:00 AM

సంగమ జలాలతో గ్రామస్తుల ప్రత్యేక పూజలు

అలంపూర్, ఆగస్టు 3: సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని గ్రామస్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా తుంగభద్ర సంగమ పవిత్ర జలాలను బిందెలతో కాలినడకన తీసుకొచ్చి స్థానిక శివాలయంలో పరమశివునికి జలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో సంగమ జలాలతో నియమనిష్ఠలతో శివుడికి అభిషేకం చేస్తే మంచి వర్షాలు కురుస్తాయనే విశ్వాసంతో ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.