మొక్కలు నాటి సంరక్షించాలి
సర్పంచ్ భూక్య బిక్కు
మోతె, ఆగస్టు 3: మొక్కలు నాటి వాటి నీ ప్రతి ఒక్కరు సంరక్షించాలని గోపతండ సర్పంచ్ భూక్య బిక్కు నాయక్ అన్నారు. సోమవారం గోప తండాలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో చెట్లు లేకపోవడంతో ఎడారులుగా కనిపిస్తున్నాయన్నారు. పచ్చదనంతో మనసు ఆహ్లాదంగా ఉంటుందని, అలాగే చెట్లు ఉంటేనే వానలు కురిసి పంటలు పండుతాయి అన్నారు. కావున ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకంలో బాధ్యతగా చేపట్టాలన్నారు.
తదుపరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గ్రామ సర్పంచ్ నెరవేర్చారని గ్రామస్తులు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాలోతు ఈశ్వరి రవి, గ్రామ కార్యదర్శి సురేష్, ఫీల్ అసిస్టెంట్ శంకర్, గోపతండ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు శివ,గుగులోతు కిట్టు, భూక్య నవీన్, మాజీ ఎంపిటిసి శ్రీరాములు, వార్డు నెంబర్లు బాసు, పెరుగు లలిత, అంగన్వాడి టీచర్లు దారమల్ల మంగమ్మ, పెరుగు రమాదేవి ఆశ వర్కర్లు, మల్టీపర్పస్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.






