30 June, 2026 | 10:34 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

లింగనిర్ధారణలో ఆడబిడ్డ అని తెలిసి అబార్షన్

29-09-2024 01:04 AM

ప్రభుత్వ వైద్యుడి అరెస్ట్

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రవీణ్ గాంధారిలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఓ మహి ళ లింగనిర్ధారణ కోసం ప్రవీణ్ కామారెడ్డిలో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన ప్రవీణ్ ఆమె గర్భంలో ఆడశిశు వు ఉన్నట్లు తెలిపాడు.

దీంతో సదరు మహిళ, కుటుంబీకుల సూచనతో అబార్షన్ చేసి గర్భాన్ని తొలగించాడు. ఈ విషయం సదరు మహిళ మహారాష్ట్రలో తెలుపడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం రాత్రి ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గతం లోనూ ప్రవీణ్‌పై లింగనిర్ధారణ చేసినట్టు ఆరోపణలున్నాయి.